ఇవి తీసుకుంటే.. గుట్టలాంటి పొట్ట కూడా గుప్పెడంత అవుతుంది
మన భారతీయ వంటల్లో వాడే మసలా దినుసులు ఆహారం రుచిని పెంచడమే కాక.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
ఈ విషయాన్ని అనేక పరిశోధనలు కూడా నిరూపించాయి.
అధిక బరువును తగ్గించే మసాలాల్లో గసగసాలు ముందు వరుసలో ఉంటాయి.
మరీ ముఖ్యంగా మన వంటింట్లో వాడు సుగంధ ద్రవ్యాలు.. అధిక బరువు సమస్యకు చెక్ పెడతాయి.
ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంటర్, బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి.
గసగసాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి.
నాడీ , మధుమేహం, గుండెజబ్బుల నుంచి కాపడటంలో గసగసాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అంతేకాక ఇవి బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి.
పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారు గసగసాలు వాడితే మేలు.
దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు బరువు తగ్గడానికి సహకరిస్తాయి.
పైగా గసగసాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండి.. బరువు తగ్గడానికి సాయం చేస్తుంది.
మార్కెట్‌లో గసగసాల సిరప్ దొరుకుతుంది. దాన్ని తెచ్చుకుని షర్బత్‌గా చేసుకుని తాగితే..
చాలా సేపు ఆకలిగా అనిపించదు. దీని వల్ల బరువు తగ్గవచ్చు
గసగసాలు కలిపిన పాలు తీసుకుంటే.. కండరాలు, ఎముకలు బలపడతాయి.
ఒక గ్లాసు పాలలో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచిది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం