ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. నయం కానీ రోగాలకు సంజీవని

ఔషధ గుణాలున్న మొక్కలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో నల్లేరు ఒకటి.

నల్లేరు తీగ జాతికి చెందిన మొక్క. ఇది నయం కానీ రోగాలకు సంజీవనిలా పని చేస్తుందంటున్నారు నిపుణులు.

నల్లేరులో కాల్షియం, విటమిన్‌ సీ, సెలీనియం, క్రోమియం, విటమిన్‌ బీ, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా అంటాయి.

నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి ఉపయోగిస్తారు.

దగ్గు, కోరింత దగ్గు, జలుబు తగ్గటానికి నల్లేరును రొట్టె, తేనె, వడియాలలో కలిపి వాడుతారు.

నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే స్త్రీలకు పీరియడ్స్‌ సంబంధిత సమస్యలు తగ్గుతాయంటున్నారు వైద్యులు.

నల్లేరు కాడల్ని వంటల్లో వాడి తింటే నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయంటున్నారు.

నల్లేరు తీగ రసం రక్తహీనత సమస్యను తీరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నల్లేరులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల పైల్స్‌ సమస్య తగ్గుతుంది.

నల్లేరులో నొప్పిని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పెయిన్‌ కిల్లర్‌లా పని చేస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం