శొంఠి ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. ఆ సమస్యలన్నీ దూరం

రుచి కోసం వంటల్లో అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అల్లాన్ని ఆహారంలో చేర్చుకుంటే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అయితే అల్లం నుంచి తయారైన శొంఠి వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అల్లం పొడినే శొంఠి అని కూడా అంటారు.

శొంఠిని మీ డైట్‌లో చేర్చుకుంటే, జీర్ణక్రియ సమస్యను నయం చేయడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. 

శొంఠి వాడటం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు.

శొంఠి వాడకం వల్ల కడుపు నొప్పితో పాటు శరీర నొప్పికి ఉపశమనం లభిస్తుంది.

శొంఠి ఆయాసం, గొంతు నొప్పి, కడుపు నొప్పి, పైత్యం, వాత, దగ్గు వంటి రోగాలను తగ్గిస్తుంది.

శొంఠి కీళ్ల వాపును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

స్కిన్, చుండ్రు సమస్యలను పోగొట్టడానికి కూడా శొంఠి బాగా ఉపయోపడుతుంది.

శొంఠి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం