Tooltip

దొడ్డు రవ్వ చేసే మేలు గురించి తెలిస్తే వదలరు!

ప్రస్తుతం ఆరోగ్యం ఎంతో ఖరీదుగా మారింది. తినే ప్రతి పదార్థం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.

కరోనా తర్వాత ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ద పెరిగింది.

సాధారణంగా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ గా ఉప్మా చేసుకొని తింటారు.

ఉప్మా రుచిగా ఉండటమే కాదు.. ఈజీగా డైజీషన్ అవుతుంది.

చాలా మంది ఉప్మా దొడ్డు రవ్వతో చేసుకొని తింటారు.దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

దొడ్డు రవ్వలో ఫైబర్, ప్రొటీన్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్  పుష్కలంగా ఉంది.

దొడ్డు రవ్వలో ఫైబర్ ఉండటం వల్ల ఆకలిని అరికడుతుంది. బరువును కంట్రోల్ చేస్తుంది.

ఇందులో ఉండే కార్పోహైడ్రైట్లు నిరంతర శక్తిని అందిస్తాయి.

దొడ్డు రవ్వ తినడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.

 దొడ్డు రవ్వ జీర్ణశక్తని పెంచుతుంది.. పేగుల కదలికలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

 మలబద్దకాన్ని నివారిస్తుంది..జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా ఉపయోగపడుతుంది.

దొడ్డు రవ్వలో భాస్వరం, మెగ్నిషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

దొడ్వు రవ్వలో పుష్కలంగా మెగ్నీషియం, ఐరన్ ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం