మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే రేషన్ కార్డు రాదు!

దేశంలో దారిద్య్ర రేఖ దిగువన ఉన్న నిరుపేదలకు రేషన్ కార్డు జారీ చేస్తుంది ప్రభుత్వం

రేషన్ కార్డు పొందేందుకు కొన్ని నిర్ధిషమైన సూచనలు చేయబడి ఉన్నాయి.

మీకు ఇల్లు, ఫ్లాటు తో సహా వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. రేషన్ కార్డు రాదు

ట్రాక్టర్, కారు ఇతర ఫోర్ వీలర్ వెహికిల్స్ ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు

మీ ఇంట్లో ఏసీ, ఫ్రిజ్ ఉంటే రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు

మీ ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రేషన్ కార్డు దరఖాస్తుకు అనర్హులు

మీ వార్షిక ఆదాయం గ్రామాల్లో అయితే రూ.2 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.3 లక్షలకు మించితే రేషన్ కార్డు రాదు

ప్రతి ఏటా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? మీరు రేషన్ కార్డుకు అర్హులు కాదు

లైసెన్స్ పొందిన ఆయుధాలు మీ వద్ద ఉంటే.. రేషన్ కార్డుకు అనర్హులు

అర్హత లేకుండా తప్పుడు పత్రాలతో మీరు రేషన్ కార్డు దక్కించుకుంటే శిక్షార్హులవుతారు

ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వస్తే చట్టరిత్యా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది

మీరు తప్పుడు పత్రాలు సమర్పించి రేషన్ కార్డు పొందితే వెంటనే సంబంధిత కార్యాలయానికి వెళ్లి సరెండ్ చేయాలి

సరెండ్ చేసే సమయంలో చేతి రాతతో ఓ లెటర్ రాసి అందజేయాల్సి ఉంటుంది.