టాటూస్ వేయించుకుంటే ఉద్యోగం రాదా.. అసలు నిజం ఇదే

నేటి కాలంలో యువత ఫ్యాషన్ కోసం రకరకాల టాటూలను వేయించుకుంటున్నారు.

తమకు ఇష్టమైన సెలబ్రిటీల పేర్లు, చిత్రాలు, లవర్స్ పేర్లు, ఇలా విభిన్నమైన టాటూలను ఒంటిపై ముద్రించుకుంటున్నారు.

ఒకప్పుడు టాటూ కేవలం చేతులపై తల్లిదండ్రుల పేర్లు, దేవుళ్ళ బొమ్మలను పొడిపించుకునేవారు.

ఇప్పుడు అందంగా కనిపించేందుకు రంగు రంగుల టాటూలను ముద్రించుకుంటున్నారు.

అయితే టాటూల వల్ల చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

టాటూలక యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది.

మరి ఈ టాటు వేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కాదంటున్నారు నిపుణులు.

టాటూస్ అనేవి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేకంగా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల్లో నిషేధమని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న వారు టాటూస్ వేసుకోవద్దన్నారు నిపుణులు.

యువత అవగాహన లేకుండా ట్యాటూలను వేసుకుని భవిష్యత్తును చిక్కుల్లో పెట్టుకుంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారు టాటూలను వేసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు పేర్కొన్నారు.