ఈ చిన్న చిట్కాలు పాటిస్తే..  మీ కాపురం ఎప్పుడూ బోర్ కొట్టదు!  

భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలని మన పెద్ద వారు ఎప్పుడో చెప్పారు.

అయితే నేటి ఆధునిక జీవనంలో వాటిని పాటించడంలో  కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

దాంతో కాపురం బోర్ కొట్టిన ఫీలింగ్ కొందరి దంపతుల్లో కలుగుతోంది. అయితే కొన్ని చిట్కాల పాటించడం వల్ల మీ కాపురం ఎన్నటికీ బోర్ కొట్టదు. అవేంటో చూద్దాం.

సాధారణంగా  భార్యభర్తలను రొమాన్స్ మాత్రమే దగ్గర చేస్తుందని కొందరు భావిస్తుంటారు. 

కానీ రొమాన్స్ ఒక్కటే వారిని దగ్గర చేయదు. ఇంకా చాలా విషయాలు వారిని దగ్గర చేసి, కాపురంలో బోరింగ్ ఫీలింగ్ రాకుండా చేస్తాయి.

మీ ఇద్దరికి ఇష్టమైన ఓ కొత్త పనిని కలిసి చేయండి. పెయింటింగ్స్, మ్యూజిక్ ఇలాంటివి ట్రై చేయండి.

అప్పుడప్పుడు కొత్త కొత్త అడ్వెంచర్లు చేస్తుండాలి, న్యూ గేమ్స్ ఆడుతుండాలి. దాంతో మీకు బోర్ కొట్టిన ఫీలింగ్ ఉండదు.

మీ పార్ట్ నర్ తో ఫ్రెండ్ లా మెలగండి. ఇలా సరదాగా ఉండటం వల్ల మీ కాపురంలో బోరింగ్ అనేదే ఉండదు.

భార్యభర్తలు ఇద్దరూ ఎప్పుడూ ఒకే చోట ఉండకుండా.. కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి, అక్కడ సరికొత్త విషయాలు తెలుసుకోండి.

ఇద్దరు కలిసి కొన్ని కొత్త వస్తువులను తయ్యారు చేయడం లాంటివి చేయండి. ఈ క్రమంలో మీ మధ్య బంధం బలపడుతుంది.

మరీ ముఖ్యంగా కపుల్స్ మధ్యలో కామెడీ స్పాంటినెస్ ఉంటే..  వారి కాపురంలో బోరింగ్ అనే పదానికి చోటే ఉండదు.