ఈ ఆకు కూర తింటే.. ఆ సమస్యలన్నింటికీ చెక్!

Dot

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేటి ఆధునిక జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది.

Dot

ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవనంలో పడి.. ఆరోగ్యంపై శ్రద్ధపెట్టడం లేదు నేటి మానవుడు.

Dot

దాంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మెుత్తం అనారోగ్యం పేరిట ఆస్పత్రుల్లో ఖర్చుపెడుతున్నారు.

Dot

అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Dot

మనం తినే ఆహారంలో ఆకు కూరలు.. మరీ ముఖ్యంగా మెంతి కూరను చేర్చుకోవడం ద్వారా ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చంటున్నారు వైద్య నిపుణులు.

Dot

మెంతికూరలో దివ్య ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Dot

మార్నింగ్ ఖాళీ కడుపుతో మెంతికూర తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

Dot

ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె వేగాన్ని అదుపులో ఉంచుంది.

Dot

మలబద్ధకం, జీర్ణ సంబంధిత వ్యాధులకు మెంతికూర చెక్ పెడుతుంది.

Dot

మెంతికూరలో విటమిన్ A, E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం