ఈ పండును రోజు తింటే.. అందం ఆరోగ్యం మీ సొంతం.

సమ్మర్‌లో మామిడి తర్వాత అందరూ ఇష్టంగా తినే పండు సపోటా.

ఈ సపోటా టేస్ట్ లోనే కాదు పోషకాలలోనూ అద్భుతం అంటున్నారు నిపుణులు.

ఇందులో ఐరన్‌, పోటాషియం, కాపర్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌, విటమిన ఏ, బి, సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి.

అలాగే ఈ పండులో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసైడ్‌ లక్షణాలతో కూడిన పాలీఫెనాల్ సమ్మేళనం టానిన్ సమృద్ధిగా ఉంటుంది.

ప్రతిరోజూ సపోటాను తీసుకుంటే ఎముకలను దృఢంగా ఉంచడంతో పాటు ఆస్టియోపోరోసిస్‌ ముప్పును తగ్గిస్తాయి.

సపోటాను తరుచూ ఆహారములో చేర్చుకుంటే ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా ఇది స్ట్రోక్‌, గుండెపోటు వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పును కూడా తగ్గిస్తుంది.

అధిక మొత్తంలో కెలొరీలుండే ఈ పండు తింటే తక్షణ శక్తిని అందిస్తుంది.

పైగా ఇందులో ఉండే ప్రోటీన్లు నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి.

వీటితో పాటు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇక సపోటలో విటమిన్‌ ఇ ఉండటంతో ఇది చర్మాన్ని కాంతవంతంగా ఉంచుతుంది.

అలాగే చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించి యాంటీ ఏజింగ్ కాంపౌండ్‌గా పనిచేస్తుంది.

ఇక మోహం పై వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.