పరిగడుపున ఈ ఆహారాలు తిన్నారో.. ఇక అంతే

నిద్ర లేవగానే చేసే పనులు ఆ రోజంతా ప్రభావం చూపుతాయి.

అలానే పరిగడుపున తినే ఆహారం కూడా మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది.

కనుక ఉదయం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇక పరిగడుపునే కొన్ని ఆహారాలు అసలు తినకూడదు. అవి ఏవంటే..

కొవ్వు పదార్ధాలను ఉదయం ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

కాబట్టి ఉదయాన్నే కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు.

ఉదయం ఖాళీ కడుపుతో చక్కెర, కృత్రిమ రుచులు, రంగులతో కూడిన తృణధాన్యాలు తినడం మంచిది కాదు.

పొద్దున్నే వీటిని తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి.

అనారోగ్యకరమైన కొవ్వులు, శుద్ధి చేసిన ధాన్యాలు, చక్కెరను కలిగి ఉన్న పేస్ట్రీలను ఉదయం తింటే శరీరం శక్తిని కోల్పోతుంది.

ఉదయం పూట చక్కెర,కేలరీలు అధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండండి.

పండ్ల రసాలలో కూడా చక్కెర ఎక్కువగానే ఉంటుంది కనుక ఉదయాన్నే వీటిని తీసుకోవడం మానుకోండి.

పరిగడుపునే వేయించిన ఆహారం తింటే మంచిది కాదు.

నిమ్మ జాతికి చెందిన కొన్ని సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ వస్తుంది.

పరిగడుపునే కృత్రిమ రుచులు, స్వీటెనర్లతో కూడిన పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం