ఈ ఫుడ్ కాంబినేషన్స్ ను కలిపి తిన్నారో.. మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే!

ఇప్పుడు చాలా మంది అనేక రకాల కొత్త ఫుడ్స్ ను టేస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

ఓకే రకమైన ఫుడ్ ను టేస్ట్ చేసే వారు కొందరైతే,  రెండు మూడు రకాల ఫుడ్స్ ను కలిపి తీసుకునే వారు మరికొందరు. 

అయితే, ఇలా రెండు మూడు రకాల ఫుడ్స్ ను కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యానికి  ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తే.. మరి కొన్ని హాని కలిగిస్తాయి.

అసలు కలిపి తీసుకోకూడని ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు, పాలు ఈ రెండిటిని అసలు కలిపి తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వాటి వలన జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చాలా మంది ఇష్టంగా తినే కాంబినేషన్ పాలక్ పనీర్.. ఎంతో టేస్ట్ గా ఉండే ఈ ఆహారపదార్ధాన్ని కూడా అసలు కలిపి తీసుకోకూడదు.

ఇలా చేయడం వలన పనీర్ లో ఉండే క్యాల్షియం, పాలకూరలో ఉండే ఇనుము రెండు శరీరానికి అందవు.

గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్... ఈ కాంబినేషన్ ను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కానీ ఇది కూడా తినకూడదు.

వీటిని తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అలాగే పాలు , చేపలు.. ఖర్జురామ్, పాలు ఈ కాంబినేషన్స్ కూడా అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం