వర్షాకాలంలో ఇవి తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే

వర్షాకాలం వచ్చేసింది. సీజన్‌ మారడంతో.. వ్యాధులు విజృంభిస్తాయి.

వాతావరణం చల్లగా, తేమగా ఉండటం వల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతాయి.

వర్షంలో తడవడం, చల్లని వాతావరణం వల్ల జలుబు, దగ్గు,గొంతు సమస్యలు వస్తాయి.

ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలను అస్సలే తినకూడదు.

ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివి అంటారు.

కానీ వానాకాలంలో వాటిని వీలైనతం తగ్గిస్తే మంచిది అంటున్నారు వైద్యులు.

అలానే జంక్‌ ఫుడ్‌, చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌ వంటి బయటి తిండికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఈ సీజన్‌లో అస్సలు తినకూడని చిరు తిండి పానీ పూరీ.

చల్లగా ఉందని చెప్పి చాలా మంది బయట బండ్ల మీద బజ్జీలు, పకోడీలు తెచ్చి తింటారు.

అయితే వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

ఇంటి దగ్గర ఉన్నంత పరిశుభ్రంగా బయట పరిస్థితులు ఉండవు.

అలానే ఈ సమయంలో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కనుక చేపలు తీనేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.

అలానే వర్షాకాలంలో పాల ఉత్పత్తులను ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది అంటున్నారు.

ఇంట్లో వేడిగా అప్పటికప్పుడు వండిన భోజనం అంతా మంచిది మరోటి లేదంటున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం