Tooltip

పెరుగుతో వీటిని కలిపి తింటే.. విషంతో సమానం..!

పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇక వేసవిలో శరీరానికి చలువ చేయడం కోసం పెరుగు తీసుకుంటారు.

భోజనం ఆఖర్లో పెరుగుతో తినకపోతే.. వెలితిగా ఫీలయ్యేవారు చాలా మంది.

పెరుగును రైతా, పెరుగు అన్నం, మజ్జిక, లస్సీ రూపంలో కూడా తీసుకుంటారు.

పెరుగులో అనేక పోషకాలతో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

అవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సాయం చేస్తుంది.

అయితే కొన్ని ఆహారాలతో పాటు దీనిని తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

పుడ్ పాయిజన్ అయి.. అనారోగ్యానికి కారణం అవుతుంది అంటున్నారు.

 మరి పెరుగుతో తినకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది పెరుగులో పండ్లు కలుపుకొని తింటారు.

వాటిల్లో ముందు వరుసలో ఉండేది మామిడి.

మామిడి వేడి చేస్తే.. పెరుగు చలువ గుణాలు కలిగి ఉంటుంది.

ఈ రెండింటి కలయిక వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడి.. చర్మ సమస్యలు వస్తాయి.

పెరుగుతో తినకూడని మరో అతి ముఖ్యమైన ఆహారం.. పాలు.

పాలను తోడేస్తే పెరుగవుతుంది.. కానీ పెరుగు, పాలు కలిపి తీసుకోవడం సరైన పద్దతి కాదు.

అలా చేస్తే అసిడిటీ, ఉబ్బరం, గుండెల్లో మంట, విరేచనాలు కలగవచ్చు.

పెరుగుతో పాటు నెయ్యి, నూనెతో కూడిన ఆహారాలు తీసుకోవద్దు.

పెరుగుతో పాటు ఆయిల్ ఫుడ్స్‌ను తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదించి.. లేజీగా ఉంటుంది.

చాలామంది పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు.

ఈ రెండు కలిపి తీసుకుంటే అవి అలెర్జీలను ప్రేరేపిస్తాయి.

మాంసాహారం వండేటపుడు దాన్ని పెరుగుతో మారినేట్ చేస్తారు.

 కానీ చేపలు, సీఫుడ్‌తో పెరుగును కలపకూడదు.

పెరుగు, చేపలు కలిపి తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్స్‌ ఉంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం