లవంగాలు తింటే.. క్యాన్సర్‌ సహా ఈ సమస్యలన్నీ దూరం

లవంగాలు చిన్నగానే ఉంటాయి కానీ కొరికితే ఘాటు నషాళానికి అంటుతుంది. !

మన దేశంలో లవంగాలను ఎక్కువగా మసలా దినుసులు, సుగంధ ద్రవ్యాలుగానే గుర్తిస్తారు.

క్యాన్సర్‌, జీర్ణకోశ సమస్యలకు లవంగాలు పవర్‌ఫుల్‌ మెడిసిన్‌ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి కనుక.. లవంగాలని పోషకాల పవర్‌హౌజ్ అంటారు.

ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉన్నాయి. ఇవి శరీరం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు సాయం చేస్తుంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, లవంగాలని తింటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలు దూరమవుతాయి.

లవంగాలు, లవంగం నూనె తీసుకోవడం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురువాపు వంటి చిగుళ్ల సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

లవంగాలు రక్తాన్ని శుద్ది చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన రక్తాన్ని శుద్ది చేసి.. ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.

అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అనేక పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

లవంగాల్లోని ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సాయపడతాయి.

కడుపులో అల్సర్‌తో బాధపడేవారు కూడా లవంగాలు తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

లవంగాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పెప్టిక్ అల్సర్ వల్ల వచ్చే మంటను తగ్గించేందుకు సాయం చేస్తాయి.

అంతేకాక ఇవి కడుపు నొప్పి, వాపు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

లవంగాల్లో ఉన్న పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ త్వరగా బరువు తగ్గడానికి సాయం చేస్తాయి.

వీటిల్లో ఉండే యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్, డైటరీ ఫైబర్, విటమిన్స్ E, C, K, ఏలు ఉన్నాయి.

ఇవి జీవక్రియని పెంచి, కేలరీలను వేగంగా కరిగిస్తాయి.

అందువల్ల లవంగాలను తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం