పరగడుపున ఈ జ్యూస్ తాగితే.. మరింత అందం మీ సొంతం

ఉసిరి కాయ.. పేరు చెబితేనే నోరూరిపోతుంది కదా. దీన్ని ఇండియన్ గూస్ బెర్రీ అని పిలుస్తారు.

వైద్య పరంగా ఉసిరికకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. యూనానీ, ఆయుర్వేద వైద్యంలో విరివిగా వినియోగిస్తారు

అలాగే ఇంట్లో కూడా వీటితో ఎక్కువగా పచ్చడితో పాటు సాంబార్ చేస్తుంటారు.

 అలాగే షాంపూస్, తలకు వినియోగించే ఆయిల్స్ తయారీలో వాడుతుంటారు

ఉసిరి కాయతో  తయారు చేసే జ్యూస్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

పరగడుపున తాగితే.. అందం, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

ఇందులో సీ విటమన్ మాత్రమే కాదు విటమిన్ A, E, కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తాయి

ఉసిరికాయలో ఉండే విటమిన్ C.. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

జలుబు, ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తుంది ఈ  జ్యూస్.

ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి

చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. మరింత యవ్వనంగా కనిపిస్తుంటారు

బ్లడ్‌లో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. బరువు కూడా కంట్రోల్ చేస్తుంది

ఆడవాళ్లు.. ఈ జ్యూస్ తాగితే.. జుట్టుకు మరింత పోషణ లభిస్తుంది. కుదుళ్ల బలోపేతానికి, పెరుగుదలకు సహకరిస్తుంది.

గుండె సంబంధిత సమస్యలను నివారించేందుకు సాయపడుతుంది ఉసిరిక జ్యూస్.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం