ప్యాకేజీ జ్యూస్‌ తాగుతున్నారా? అయితే డేంజర్ లో పడినట్లే..

దేశంలో ప్యాకేజ్డ్ జ్యూస్ ల వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 ఎందుకంటే   వివిధ బ్రాండ్ ల పేర్లతో మార్కెట్ లో దొరుకుతున్న  ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లు తాగితే ఆరోగ్యనికి చాలా మంచిదని చాలామంది ఆపోహ పడుతున్నారు.

కానీ, ఈ ప్యాకేజ్డ్ పండ్ల జ్యూస్ ను తాగితే ఆర్యోగానికి మేలు బదులు హని చేస్తుందని ఐసీఎంఎఆర్ స్పష్టం చేసింది.

ముఖ్యంగా నేచురల్ ప్రొడక్ట్స్ తో తయారు చేస్తున్నమని చెప్పుకొస్తున్న ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లో కృత్రిమ రుచులను వినియోగిస్తున్నారని సమాచారం.

పైగా వీటిలో ఎక్కువ శాతం చక్కెర ను వినియోగిస్తున్నారని ఇందులో సహజమైన పండ్ల రసాన్ని వినియోగించడం లేదని వైద్య నిపుణులు తెలిపారు.

ఇక ఈ ప్యాక్టేజ్డ్ జ్యూస్ లో కార్న్ సిరప్ కలుపుతున్నారని, ఈ రకమైన రసంలో ఫ్రక్టోజ్ ఉంటుదని వైద్యులు చెబుతున్నారు.

అయితే వీటిని తాగడం వలన ఆరోగ్యనికి చాలా ప్రమాదమని, ముఖ్యంగా కాలేయం దెబ్బ తింటుదని తెలిపారు.

దీంతో ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు,డిమెన్షియా, బ్రెయిన్ ఫాగ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కనుక ఎలాంటి పరిస్థితిలో ఈ జ్యూస్ లను తాగకూడదని దీనివలన ఫ్యాటీ లివర్ సమస్య ఎదుర్కొంటరని చెబుతున్నారు.

ఎందుకంటే ఈ రకమైన జ్యూస్ ల్లో చక్కెర ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. దీని వలన మధుమేహానికి దారి తీస్తుంది అన్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం