ప్రతి రోజు యాలకుల నీటిని తాగితే.. ఆ సమస్యలన్నా పరార్..!
నేటి కాలంలో అప్పులు లేని వాళ్లు.. ఆస్పత్రికి వెళ్లని వాళ్లు అధిక అదృష్టవంతులు అని చెప్పవచ్చు.
మారుతున్న జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి.
అయితే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. ఆయురారోగ్యాలు మీ సొంతం అని అంటున్నారు నిపుణులు.
మరీ ముఖ్యంగా లేవగానే టీ, కాఫీల బదులు హెల్త్ డ్రింక్స్ తాగితే బెటర్ అంటున్నారు.
పరిగడుపునే యాలకుల నీరు తాగితే.. ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
యాలకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా ఇది ఆయుర్వేదిక మూలిక కూడా.
కనుక ఆయుర్వేదంలో అనేక సమస్యల పరిష్కారం కోసం దీన్ని ఉపయోగిస్తారు.
ఉదయాన్నే పరిగడుపునే యాలకుల నీటిని తాగితే.. జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది.
ఫలితంగా మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీరాన్ని లోపలి నుంచి నిర్విషీకరణ చేయడంలో యాలకుల నీరు ఎంతో బాగా పని చేస్తుంది.
ఇవి శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపుతాయి.
నోటి దుర్వాసనతో బాధ పడేవారు యాలకుల నీళ్లు తాగితే మంచిది అంటున్నారు.
వీటిలో ఉంటే ఫంగల్ లక్షణాలు నోటి దుర్వాసనను తొలగించి.. పరిశుభ్రతను ప్రోత్సాహిస్తాయి.
అలానే మహిళలు పిరియడ్ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందడానికి యాలకుల నీటిని తాగవచ్చు.
ఇది హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో సాయం చేస్తుంది.
అధిక బరువుతో బాధపడుతున్న వారు.. యాలకుల నీటిని ఉదయం ఆహారంలో భాగం చేసుకోవాలి.
అధ్యయనాల ప్రకారం యాలకులు బరువు నియంత్రణలో మంచి ఫలితాలను ఇస్తాయి.
ఇందుకోసం మీరు గ్లాస్ నీటిలో రెండు, మూడు యాలకులు వేసి మరిగించాలి.
ప్రతి రోజు పరిగడుపున ఈ నీటిని తాగితే చాలా మంచిది అంటున్నారు నిపుణులు
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం