Thick Brush Stroke

డిన్నర్ లో ఇవి తినకుంటే చాలు.. షుగర్ కి దూరంగా ఉండొచ్చు!

జీవన ప్రక్రియలో మనం చేసే డిన్నర్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి.

రాత్రి చేసే డిన్నర్‌లో అందరు  చేసే కొన్ని పొరపాట్ల వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. 

దీని వలన త్వరగా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

కాబట్టి డిన్నర్ టైమ్ లో ఎలాంటి ఆహార పదార్దాలను తీసుకోకూడదు అనేది చూద్దాం.  

పండ్లు ఆరోగ్యానికి మంచిదే అయినా.. డిన్నర్ టైమ్ లో వీటిని తీసుకోకపోవడం మంచిది.

రాత్రి పూట పండ్లు తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

నూడుల్స్, పాస్తా లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ను రాత్రుళ్ళు తినకూడదు. 

అవి హై కార్బోహైడ్రేట్ కలిగి ఉండడం వలన గ్లూకోజ్ లెవెల్స్ ను పెంచుతాయి. 

 కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం డిన్నర్ లో ఈ ఆహార పదార్ధాలను తీసుకోకపోవడం మంచిది. 

 అలాగే చాలా మంది డిన్నర్ ఆలస్యంగా చేస్తూ.. వెంటనే నిద్రపోతుంటారు.  

డిన్నర్ చేయడానికి, పడుకోవడానికి కనీసం 3 గంటల గ్యాప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం