కీరదోసను ఇలా తినడం లేదా.. అయితే మీరు నష్టపోతున్నట్లే

కీరదోసను ఆహారంలో చేర్చుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  

కీర దోసలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యలు తలెత్తవు.

దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

కీరదోస రసం తాగితే శరీరం    నిగారింపు సంతరించుకుంటుందంటున్నారు నిపుణులు.

మూత్ర పిండాల్లో రాళ్లు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది.

దీనిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.

కీరోదోసను తొక్క తీసి తినడం కంటే తొక్కతో తింటేనే మంచి ఫలితం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కీరదోస తొక్కలో అనేక పోషకాలుంటాయి. తొక్కతో తినడం వల్ల బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

కీరదోస తొక్కలోనూ కే విటమిన్‌ సమృద్ధిగా ఉండడంతో చర్మానికి మేలు చేకూరుస్తుంది.

కీరదోసలో తొక్కలోని విటమిన్ ఏ, కేలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కీరదోస తొక్కలోని ఆస్కార్బిక్ ఆసిడ్ చర్మానికి మేలు చేస్తుంది.

ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేందుకు కీరదోస తొక్క ఉపయోగపడుతుంది.