వంటల్లో ఈ నూనెను చేర్చుకుంటే మీ గుండె సేఫ్.. ఒకటి, రెండూ కాదు.. ఎన్నో ప్రయోజనాలు!

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. తినే ఆహారం విషయంలో తీసుకునే జాగ్రత్తలు హెల్త్ మీద ఎంతగానో ప్రభావం చూపిస్తాయి.

వంటల్లో వాడే నూనెలు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే మంచి ఆయిల్​ను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో ఎక్కువగా పల్లి, కొన్ని చోట్ల కొబ్బరి నూనెను వంటల్లో ఉపయోగిస్తారు. అయితే వీటి కంటే కూడా ఇంకో ఆరోగ్యకరమైన నూనె ఉంది. అదే రైస్ బ్రాన్.

ఆసియా దేశాల్లో రైస్ బ్రాన్ఆయిల్ ఉపయోగం ఎక్కువ. జపాన్, చైనాల్లో దీన్ని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ మధ్య మన దేశంలోనూ దీని వాడకం పెరిగింది.  

పండిన వరిని ఎండబెట్టి మిల్లులు పట్టిస్తారు. ఆ టైమ్​లో రైస్​లో నుంచి వచ్చిన తవుడును జంతువులకు మేతగా ఉపయోగిస్తారు. అయితే ఇందులో ఎన్నో పోషకాలు ఉండటంతో దీని నుంచి నూనెను తీయడం స్టార్ట్ చేశారు. 

 రైస్ బ్రాన్ ఆయిల్ ఆహారానికి రుచిని జోడించడమే గాక మొత్తం శరీర ఆరోగ్య క్రియలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రైస్ బ్రాన్ ఆయిల్ లో హెల్త్ ఫ్యాట్ ఉంటుంది. ఈ ఆయిల్ లిపిడ్ ప్రొఫైల్, మెటబాలిక్ సిండ్రోమ్ ను ప్రభావితం చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.

ఈ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫ్రెండ్లీ ఫైటోకెమికల్స్ గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

హృదయ సంబంధిత సమస్యలను తరిమికొట్టేందుకు వంటల్లో ఈ నూనెను చేర్చుకోవడం ఉపయుక్తమని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. ఇందులోని ఓరిజనాల్ వల్ల కొలెస్ట్రాల్ శోషణ తగ్గి, కొలెస్ట్రాల్ విసర్జన పెరుగుతుందని చెబుతున్నారు.

రైస్ బ్రాన్ ఆయిల్ శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ బయోకెమిస్ట్రీ స్టడీ ప్రకారం రైస్ బ్రాన్ ఆయిల్ వాడం టైప్-2 డయాబెటిస్ రోగుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను 30 శాతం గణనీయంగా తగ్గించిందని వెల్లడైంది.

ఈ ఆయిల్ లోని యాంటీఆక్సిడెంట్ల సమూహంతో పాటు టోకోట్రినాల్స్ కలసి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తున్నాయని ఎక్స్ పర్ట్స్‌ అంటున్నారు.

అండాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, మెదడు క్యాన్సర్ గా ఏర్పడే కణాల పెరుగుదలను ఇందులోని టోకోట్రినాల్స్ సమర్థవంతంగా అడ్డుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం