ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వచ్చే ఛాన్స్‌.. జాగ్రత్తపడండి

నేటి కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

వయసుతో సంబంధం లేకుండా.. చిన్నాపెద్దా అందరూ హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతున్నారు.

కొందరిలో సడెన్‌గా గుండెపోటు వచ్చి.. వెంటనే చనిపోతున్నారు.

అయితే గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు వైద్యులు.

వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే.. హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు.

గుండెపోటు ముందు తల తిరగడం, చల్లగా చెమటలు పడతాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

హార్ట్‌ ఎటాక్‌కు ముందు ఎడమవైపు చేయి ఎక్కువగా లాగుతంది.

అలానే గుండెపోటుకు ముందు ఛాతిపై ఒత్తడి పడినట్లు అనిపించి.. సరిగ్గా ఊపిరాడదు.

నాడీ కూడా కొట్టుకున్నట్లు అనిపించదు.

నీసరంగా అనిపించి.. తల తిరుగుతున్నట్లు అవుతుంది.

దవడ, మెడ, వెనుక భాగంలో నొప్పి వస్తుంది. ఎడమవైపు అకౌకర్యంగా ఉంటుంది.

అలానే గుండెపోటుకు ముందు కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బినట్లు అనిపిస్తాయి.

కొందరిలో హార్ట్‌ ఎటాక్‌ రావడానికి ముందు చేయి నుంచి భుజం వరకు నొప్పి వస్తుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి అంటున్నారు నిపుణులు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం