లిప్‌ బామ్‌లో ఇవి లేకపోతే వాడినా ఉపయోగం ఉండదు.. అవేంటంటే!

మేకప్‌ ఏమాత్రం ఇష్టపడని వాళ్లు కూడా వాడే ఏకైక సౌందర్య సాధనం.. లిప్‌ బామ్‌.

మన శరీరంలో అతి సున్నితమైన చర్మం ఉండేది పెదాలపైనే.

అందుకే లిప్ బామ్ కొనే ముందు దానిలో ఈ పదార్థాలున్నాయో లేదో చూసి కొనండి..

విటమిన్ ఈ లోని యాంటీ యాక్సిడెంట్ గుణాలు పెదాలను పొడిబారకుండా, నలుపుదనం తగ్గించి.. తేమగా ఉంచుతాయి.

అందుకే విటమిన్ ఈ ఉన్న లిప్‌బామ్ ఉత్తమమైనవి అని చెప్పవచ్చు.

లిప్ బామ్ బదులు షియా బటర్ పెదాలకు నేరుగా రాసుకున్నా ఫలితం ఉంటుంది.

కాస్త రంగు, మెరుపు కావాలి అంటే షియాబటర్ ఉన్న లిప్ బామ్ ఉత్తమం.

పెదాల సంరక్షణ కోసం కొబ్బరి నూనె అత్యుత్తమం.

పెదాలు పొడిబారినా, పొట్టు తేలుతున్నా, పగుళ్లు ఎక్కువగా ఉన్నా కొబ్బరి నూనె రాసుకోవచ్చు.

కాబట్టి కొబ్బరి నూనె కలిసిన లిప్ బామ్ ఎంచుకుంటే పైన చెప్పిన ఫలితాలు పొందొచ్చు.

పెదాల మీద సూర్యరశ్మి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి మీరెంచుకునే లిప్‌బామ్ కనీసం ఎస్‌పీఎఫ్ 30 ఉన్నది ఉండాలి.

ఆముదం ఉన్న లిప్ బామ్ ఎంచుకుంటే అందమైన, ఆరోగ్యవంతమైన పెదాలు మీ సొంతం.

జొజొబా ఆయిల్‌ ఉన్న లిప్‌ బామ్‌ పెదాలను మృదువుగా ఉంచడమే కాక నలుపును కూడా తగ్గిస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం