కల్తీ వంట నూనెను గుర్తించండి ఇలా

కూరలేనిదే ముద్ద దిగదు. ఈ కూర వండేందుకు కావాల్సిన అతి ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి నూనె

ఇప్పుడు అనేక నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరు వారి ఇష్టాన్ని, బడ్జెట్ బట్టి ఆయా ఆయిల్స్‌ను  వినియోగిస్తుంటారు

 వేరు శనగ, పామాయిల్, పప్పునూనె, సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తారు

అయితే వీటిల్లో కూడా కల్తీ నెలకొంటుంది. ట్రై ఆర్థో క్రెసిల్ పాస్ఫైట్‌తో కల్తీ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు.

దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు వస్తున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటోంది

మరీ ఈ నకిలీ నూనెను గుర్తించం ఎలా అనుకుంటున్నారా.. ?

ఫుడ్ సేఫ్టీ సంస్థ FSSAI సూచనల ప్రకారం.. ఒక గిన్నెలో 2ఎంఎల్ నూనెను ఓ గిన్నెలో తీసుకోవాలి

అందులో ఒక చెంచా పసుపు వెన్న యాడ్ చేయాలి. అప్పుడు రంగు మారకపోతే అది ఒరిజినల్

ఇది వినియోగించవచ్చు. అదే  నూనె కలర్ మారితే ..అది కల్తీది అని నిర్దారించుకోవచ్చు

వెన్న లేకపోతే ఎలా అనుకుంటే.. ఇలా కూడా చేసి చూడండి

గిన్నెలో కొద్దిగా నూనె పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి.  స్వచ్ఛమైన నూనె అయితే గడ్డకడుతుంది

ఒక వేళ కల్తీ నూనె అయితే.. ద్రవంగా ఉంటుంది.

అలాగే వాసనను బట్టి కూడా నూనె స్వచ్ఛమైనదా.. నకిలీదా అని గుర్తించవచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం