బలం కోసం ప్రోటీన్ పౌడర్ వాడేవారికి ఐసీఎమ్ఆర్ హెచ్చరిక

చాలా మంది ఎముకలు, కండరాల బలం కోసం బయట మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లు వాడుతుంటారు.

అయితే ఈ ప్రోటీన్ పౌడర్లను వాడడం మంచిది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది.

ప్రోటీన్ పౌడర్ వాడకాన్ని ఇక ఆపాలని ఐసీఎంఆర్ భారతీయులకు సూచించింది.   

36 రకాల ప్రోటీన్ పౌడర్ల మీద ఐసీఎమ్ఆర్ ఒక మెడికల్ సర్వే నిర్వహించింది.

ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం మూత్రం ద్వారా బయటకు పోతుందని.. దీని వల్ల ఎముకలు దెబ్బ తినే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ప్రోటీన్ పౌడర్ తియ్యగా, రుచిగా ఉండడం కోసం అందులో చక్కెరతో పాటు పలు రకాల కెమికల్స్ ని కలుపుతారు. వీటి వల్ల అలర్జీ వస్తుందని చెబుతున్నారు.

ప్రోటీన్ పౌడర్ కి బదులుగా ప్రోటీన్స్ కలిగిన ఆకుకూరలు, గుడ్లు, చేపలు, చికెన్, పల్లీలు, కాజూ బాదం వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రోటీన్ పౌడర్ కి ప్రత్యామ్నాయంగా బనానా ప్రోటీన్ షేక్ తీసుకోవచ్చునని చెబుతున్నారు.  

మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లతో కాకుండా సహజమైన పద్ధతుల్లోనే శరీరానికి ప్రోటీన్స్ అందించాలని నిపుణులు చెబుతున్నారు.  

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం