తులసితో గుండెపోటు సమస్యకు చెక్‌..  ఎలా అంటే

హిందువులు తులసిని పవిత్రంగా పూజిస్తారు.

ఆధ్యాత్మికంగానే కాక ఆరోగ్యపరంగా కూడా తులసి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రతి రోజు తులసి ఆకుల టీని తీసుకుంటే గుండెపోటు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించాలి.

కొలెస్ట్రాల్‌ రెండు రకాలుగా ఉంటుంది.

హెచ్‌డీఎల్‌, ఎల్‌డీఎల్‌ అని రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి.

రక్తంలో ఎల్‌డీఎల్ స్థాయిలు అధికంగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

ఎల్‌డీఎల్‌ ఎక్కువగా ఉంటే గుండె ధమనుల్లో రక్త ప్రసరణను దెబ్బ తీస్తుంది.

దీన్ని వల్ల స్ట్రోక్‌, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

అంతేకాక దీని వల్ల బీపీ, ఇతర శారీరక సమస్యలు కూడా వస్తాయి.

అయితే ఈఎల్‌డిఎల్‌ని తగ్గించడంలో తులసి చాలా బాగా పని చేస్తుంది.

తులసి ఆకుల టీని రోజూ తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

తులసి ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. 

దీని వల్ల ఎల్‌డీఎల్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఒత్తిడి వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఉదయం తులసి టీ తాగితే.. మైండ్‌, బాడీ రిలాక్స్‌ అవుతాయి.

తులసి  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.