పోలింగ్ బూత్ లో ఓటు వేసే విధానం?  వివరాలు ఇవే..!

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నడుస్తోంది.

అలానే మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్యంగా ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలలు జరగనున్నాయి.

ఇక ఎన్నికల నేపథ్యంలో కొందరికి ఓటు ఎలా వేయ్యాలి అనే అంశంపై సందేహాలు ఉంటాయి.

పోలింగ్ కేంద్రంలో తాము అనుసరించాల్సిన విధానం గురించి సరిగ్గా అవగాహన ఉండదు.

ఈ క్రమంలో ఓటు ఎలా వేయ్యాలి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

ముందుగా ఏ పోలింగ్  బూత్ పరిధిలో తమ ఓటు ఉందో నిర్ధారించుకోవాలి

ఓటర్ స్లిప్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

పోలింగ్ కేంద్రంలో మన వివరాలను తొలి అధికారి పరిశీలిస్తారు.

ఓటర్ పేరును అధికారిగా గట్టిగా చదివి ఏజెంట్లకు వినిపిస్తారు.

అనంతరం రెండో అధికారి ఓటర్  పేరును, సంఖ్యను నమోదు చేస్తారు.

మూడో అధికారి వద్దకు వెళ్లగానే .. ఓటర్ దగ్గర ఉన్న సిప్లి తీసుకుంటారు

అనంతం బ్యాలెట్ పై క్లిక్ ఇచ్చి.. ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.

ఇక మనం నచ్చిన పార్టీకి ఓటు వేయ్యగానే బీప్ మని శబ్దం వస్తోంది.

దీంతో  మనం వేసిన ఓటు పూర్తైనట్లు భావించవచ్చు.

అనంతరం ఎగ్జిట్ ప్రాంతం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.