ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం

వేసవికాలం ప్రారంభం అయ్యింది.

ఎండలు మండిపోతున్నాయి. మధ్నాహ్నం పూట బయటకు రాలేకపోతున్నాం.

ఇక వేసవికాలంలో తరచుగా ఎదురయ్యే సమస్య వడదెబ్బ.

మరి ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారం, ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

నీరు ఎక్కువగా తాగాలి.. లేదంటే డీహైడ్రేషన్‌ బారిన పడే అవకాశం ఉంది.

కనుక శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు తీసుకోవాలి.

పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి.

మసాలా, స్పైసీ ఫుడ్స్‌ తినకపోవడమే మంచిది.

మాంసాహారం కూడా వీలైనంత వరకు తగ్గించాలి.

పెరుగు, మజ్జిగ, పళ్ల రసాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

ముదురు రంగు, మందపాటి దుస్తులు ధరించకూడదు.

కాటన్‌, లేత రంగు వస్త్రాలు ధరించాలి.

ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిది.

దాహంగా లేకపోయినా తరచుగా శుభ్రమైన నీరు తాగాలి.

పగటిపూట ఆల్కహాల్, కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌ సేవించకూడదు.

బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీని వాడాలి.

ORSద్రావణం, నిమ్మ రసం వంటివి ఎక్కువగా తీసుకోండి.