జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ పెట్టండి?

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు వేదిస్తున్నాయి.

చుండ్రు సమస్యతో కూడా ఎంతో మంది బాధపడుతుంటారు. అయితే జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.

ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు సరిపడా ఉల్లిపాయ కరివేపాకు జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.   ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

ఒక గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను కలపాలి. బాగా మిక్స్‌ చేసి జుట్టుకు పట్టించాలి. జుట్టు ఎక్కువగా ఉంటే తగిన పరిమాణంలో మిక్స్‌ చేసుకోవాలి. జుట్టుమీద మసాజ్‌ చేసినట్లు పట్టించి ఇరవై నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే జుట్టులో కాంతి వస్తుంది.

సగం అరటిపండును గుజ్జుగా చేసి బౌల్‌లో తీసుకోవాలి. అందులో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం తగ్గుతుంది.

బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, మరో టేబుల్‌ స్పూన్‌ అలొవెరా జెల్‌ను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు కుదుళ్లలో ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఇదో చక్కని కండీషనర్‌లా పని చేస్తుంది. చుండ్రు సమస్యలు ఇట్టే మాయమవుతాయి.

కోడిగుడ్డులోని తెల్లసొన, టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, టేబుల్‌ స్పూన్‌ అలొవెరాజెల్‌ కలపాలి. ఈ మిశ్రమంతో హెయిర్‌ మాస్క్‌ వేస్తే.. జుట్టు గట్టిగా తయారవుతుంది.

బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.