ఎండ నుంచి మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకునే టిప్స్!

మార్చి నెలలో రావాల్సిన ఎండలు ఫిరబ్రవరి రెండో వారంలోనే మొదలయ్యాయి.

బయటకు రావాలి అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

అందరూ ఇప్పటి నుంచే వేసవి జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు.

అయితే ఎప్పుడూ చేసే పొరపాటు ఏంటంటే.. చర్మాన్ని మాత్రం పట్టించుకోరు.

ఈ వేసికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మం సౌందర్యం కూడా కాపాడుకోవచ్చు.

ఎండలో బయటకు వెళ్లాలంటే స్త్రీలు స్కార్ఫ్, పురుషులు క్యాప్ ధరించాలి.

ఎండకు వెళ్లాలంటే.. ముఖం చేతులకు సన్ స్క్రీన్ రాసుకోవాలి.

ఈ ఎండలకు హాఫ్ హ్యాండ్స్, చేతులు కనిపించేలా దుస్తులు వాడద్దు.

రోజూ అధిక మొత్తంలో నీళ్లు తాగితే.. స్కిన్ హెల్త్ బాగుంటుంది.

వేసవిలో పుచ్చకాయ, కీరా, కర్బూజా వంటివి బాగా తినాలి.

స్కిన్ టాన్ అవుతుంటే.. డీ టాన్ క్రీమ్ వాడితే మంచిది.

స్కిన్ కి టోనర్ వాడటం ముఖ్యం. ఇది పీహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది.

సమ్మర్ లో సీరమ్ వాడకపోతే మంచిది అంటూ ఎక్స్ పర్ట్స్ చెప్తుంటారు.

సమ్మర్ లో సీరమ్ వల్ల చెమట మరింత పెరిగి.. ముఖం నల్లగా అవుతుంది అంటారు.

ఈ చిట్కాలు అన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి.