దగ్గు తగ్గడం లేదా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందడి!

నిత్యం దగ్గుతో బాధపడే వారు.. రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవొచ్చు

తప్పితీగ రసం రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. వాత, పిత్త, కఫాల ఇబ్బంది తొలగిస్తుంది.

తేనె, దాల్చిన్ చెక్క, యష్టిమధురం పొడి గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే గొప్ప ఉపశమనం ఉంటుంది.

శోంఠిగా పిలిచే ఎండు అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. శొంఠిని తేనెలో కలిపి తీసుకంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

రెండు చెంచాల నూనె కాచి.. ఓ పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి భద్రపరచాలి. దీన్ని ఛాతికి, గొంతుకి రాస్తే ఉపశమం ఉంటుంది.

నాలుగైదు తమలపాకులు వేడి చేసి నూరి ఆ రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే దగ్గు తగ్గుతుంది.

కొన్ని జామాయిల్ (యూకలిప్టస్) ఆకులను మరిగించి తర్వాత నీటిలో వడగట్టి అందులో పంచదార కలిపి మూడు పూటలా తాగితే దగ్గు తగ్గుతుంది.

దగ్గు బాగా ఉంటే రోజు రెండు పూటల గ్లాసు పాలలో అల్లం లేదా వెల్లుల్లి రసం వేసి మరిగించి అందులో పసుపు వేసి గోరువెచ్చగా తాగితే మంచి ఉపశమనం

దానిమ్మ రసంలో కాస్త అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి రెండు పూటలా తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగాలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ దాని నుంచి వచ్చే రసం మింగాలి.. దీని వల్ల గర గర తగ్గుతుంది. గొంతు ఫ్రీ అవుతుంది.

వామును నలిపి దవడకు వేసుకొని చప్పరించాలి.. ఇలా చేస్తే దగ్గును కొంతమేర  తగ్గిస్తుంది.

ఉదయం పూట చెంచా తేనలో చిటికడు మిరియాల పొడి కలిపి తాగితే చాలా వరకు దగ్గు, జలుబు నయం అవుతుంది.

తులసి ఆకుల రసాన్ని తీసుకొని అందులో తగినంత తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.