ముఖం మీది మచ్చలు, మొటిమలను.. ఈ చిట్కాలతో పోగొట్టుకోండి!

ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఒక బౌల్ లో అరస్పూన్ శనగపిండి, అరస్పూన్ బియ్యం పిండి, అరటితొక్క మెత్తని పేస్ట్ ఒక స్పూన్, అరస్పూన్ ఆలోవెరా జెల్ వేసి సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు, తాన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

అరటిపండు తొక్కలో ఉన్న లక్షణాలు ముఖం మీద మచ్చలను తొలగించటానికి, బియ్యంపిండి,శనగపిండిలో ఉన్న లక్షణాలు మృత కణాలను తొలగిస్తుంది. ఆలోవెరా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

కొద్దిగా మీరు ముందు వరి పిండి తీసుకోండి. అందులో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతం లో అప్లై చేయండి. నెమ్మదిగా దీనిని గుండ్రంగా అప్లై చేసుకోండి. కాసేపు అలా వదిలేసి నీళ్లతో కడిగేసుకోండి.

ముఖం మీద మచ్చలు పోవాలంటే రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగండి. అదే విధంగా ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మ రసం వేసుకుని ఉదయాన్నే తాగండి.

చాలా మంది ఎక్కువ సార్లు రోజులో ముఖాన్ని కడుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ సార్లు సబ్బు, ఫేస్ వాష్‌తో కడుక్కోవడం మానేయండి.

కీర దోస తురుము కానీ కీర దోస జ్యూస్ కానీ మీ చర్మానికి మంచి చేస్తుంది. కీర దోస జ్యూస్‌ని కాని తురుముని కానీ తీసుకొని ముఖానికి అప్లై చేయండి. ఒక పది నిమిషాల పాటు దానిని అలా వదిలేసి ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. దీంతో మంచి ప్రయోజనం ఉంటుంది.