అన్నం తినే ప్లేట్లను ఎన్ని రోజులకొకసారి మార్చాలి?

ఒకప్పుడు అంటే అరిటాకులు లేదా మట్టి పాత్రల్లో అన్నం తినేవారు.

ఆ తర్వాత స్టీల్ కంచాలు, వెండి కంచాలు, రాగి కంచాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత పింగాణీ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు వస్తున్నాయి.

అయితే స్టీల్ కంచాలు, పింగాణీ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు ఎక్కువ మంది వాడుతుంటారు.

వెండి కంచాలు, రాగి కంచాలు ఖరీదైనవి కాబట్టి అందరూ వాడలేరు.  

అయితే ఎక్కువ రోజుల పాటు ఒకే ప్లేట్లలో అన్నం తినడం మంచిదేనా?

అన్నం తినే ప్లేట్లను ఎన్ని రోజులకొకసారి మార్చాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. అన్నం ప్లేట్లను ప్రతి 3 నెలలకొకసారి గానీ, 6 నెలలకు ఒకసారి గానీ మార్చాలి.   

అయితే ప్లాస్టిక్ ప్లేట్లను మాత్రం నిపుణులు సజెస్ట్ చేయడం లేదు. ప్లాస్టిక్ ప్లేట్లు ఒకసారి తినేసి వదిలేయడానికే అని చెబుతున్నారు.

ప్లాస్టిక్ ప్లేట్లలో ఫుడ్ తినడం వల్ల హెల్త్ రిస్క్ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.

ప్లాస్టిక్ ప్లేట్లను ఏడాదికొకసారి గానీ కనీసం మూడేళ్లకొకసారి అయినా గానీ మార్చాలని చెబుతున్నారు.

అయితే శుభ్రత, భద్రత విషయాలకొస్తే కనుక అన్నం తినే ఏ ప్లేట్లను అయినా గానీ మూడు నెలలకొకసారి అయినా మార్చాలని చెబుతున్నారు.  

పింగాణీ ప్లేట్లను ప్రతి మూడేళ్ళ నుంచి ఐదేళ్లకొకసారి మార్చమని నిపుణులు చెబుతున్నారు.