ఎండాకాలం హైబీపీ నుంచి ఇలా తప్పించుకోండి!

ఎండకాలం బీపీ ఉన్న వారు కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు.

అలాంటి వారి కోసమే ఈ చిట్కా! సమ్మర్‌లో బీపీని ఎలా కంట్రోల్‌లో పెట్టాలో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా బీపీ పేషెంట్లు తీసుకునే డైట్‌లో పొటాషియం ఒకటి.

ఇది ఉప్పు ప్రతికూల ప్రభావాలను సమతుల్యం చేస్తోంది.

సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు తాగడం బీపీ ఉన్నవారికి మేలు చేస్తోంది.

కొబ్బరినీరులోని ట్రైగ్లిజరైడ్స్‌, రక్తంలోని కొవ్వు స్థాయిని తగ్గిస్తోంది. దీంతో బీపీ ఉన్న వారికి మంచి జరుగుతుంది.

సాధారణంగా రక్తపోటు 120/90కి దగ్గరగా ఉంటుంది. ఇది 140/90 దాటినప్పుడు హైబీపీ అంటారు.

బీపీ పేషెంట్లు ఎండకాలంలో డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది.

డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవాడానికి కొబ్బరి నీళ్లు మంచి ఔషధం.

కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ ఉన్నవారికి మంచి చేస్తోంది. 

పొటాషియం మూత్రం నుంచి సోడియం, ఐరన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

బీపీ ఉన్నవారి శరీరంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. సోడియం ఎక్కువైతే.. గుండెపై ప్రభావం చూపొచ్చు.

ఆ సోడియాన్ని శరీరం నుంచి పంపించి, రక్త ప్రసరణను మెరుగుపర్చాలన్నా, రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గించాలన్నా సమ్మర్‌లో బీపీ పేషెంట్లు కొబ్బరినీళ్లను తప్పక తీసుకోవాలి.