కడుపు ఉబ్బరం/గ్యాస్ ను చిటికెలో మాయం చేసే వంటింటి చిట్కాలు!

Floral

కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధ పడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

Floral

ఈ సమస్యకు ప్రధాన కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు అని చెప్పచ్చు.

Floral

కొంతమందికి కాస్త ఆహారం తీసుకోగానే కడుపు మొత్తం ఉబ్బరంగా అయిపోతుంది.

Floral

గ్యాస్ట్రిక్ సమస్యను లైట్ తీసుకోవడానికి లేదు. ఎంతో ప్రమాదకరం కూడా.

Floral

అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇందుకుక పరిష్కారం మీ వంటింట్లోనే ఉంది.

Floral

అల్లానికి కడుపు ఉబ్బరం తీర్చే గొప్ప శక్తి ఉంది. జీర్ణశక్తిని కూడా మెరుగు పరుస్తుంది.

Floral

గ్లాసు నీటిలో చిన్న అల్లం ముక్క వేసి మరిగించి పొద్దున్నే తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.

Floral

మరిగే నీటిలో క్రష్ చేసిన 5 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు మిరియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి వేసి మరిగించి వడకట్టి తాగితే మంచిది.

Floral

గ్లాసు నీటిలో కాస్త వాము వేసి మరిగించి ఉదయాన్నే పరగడున తాగితే గ్యాస్ సమస్యలు దరి చేరవు.

Floral

అసిడిటీతో ఉన్నవాళ్లు గ్లాసు నీటిలో వాము, జీలకర్ర వేసి మరిగించి తాగితే ఉపశమనం ఉంటుంది.

Floral

గ్యాస్ తో బాధ పడుతున్న సమయంలో ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఉపశమనం లభిస్తుంది.

Floral

ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో 2 స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని తాగితే గ్యాస్ ఉపశమనం లభిస్తుంది.

Floral

గ్లాసు వేడినీటిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి ఉదయాన్నే తాగితే గ్యాస్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

Floral

ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే మీ గ్యాస్ సమస్య తీరేందుకు ఆస్కారం ఉంటుంది.

Floral

ఎంతకీ కడుపు ఉబ్బరం/గ్యాస్ సమస్య తీరడం లేదు అంటే వైద్యులను సంప్రదించడం మంచిది.