సాస్‌ను ఎక్కువగా లాగిస్తున్నారా?  ఏం జరుగుతుందో తెలుసా?

మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది.

చాలా మంది ఫ్రైడ్  ఫుడ్స్, జంక్ ఫుడ్స్, చపాతీలు ఎక్కువగా తింటుంటారు.

జంక్ ఫుడ్స్, చపాతీలను తినే క్రమంలో రకాల సాస్ లను ఎక్కువగా వాడుతుంటారు.

వేడి సాస్ లు, స్వీట్ సాస్ లు, టాంగీ సాస్ లు ఆహారానికి మరింత రుచిని కలిగిస్తాయి.

సాస్ లను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని కొందరు అభిప్రాయ పడుతుంటారు.

అయితే మసాల సాస్ లను వాడితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

మిరియాలతో తయారు చేసిన సాస్ తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందంట.

మిరపకాయల్లో ఉండే క్యాప్సెసిన్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

మిరిపకాయలతో తయారు చేసిన సాస్ తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి.

అలానే మైగ్రేస్, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు, ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్ ఉంచవచ్చు.

అయితే ఈ సాస్ ను మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణల అంటున్నారు. ఎక్కువగా తీసుకుంటే నష్టాలు కచ్చితంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేడి సాస్ లో అధిక సోడియం రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతుంది.

అందుకే సాస్ ను తాజా ఆహారాల్లో మాత్రమే వాడాలని ఆరోగ్య నిపులు చెబుతున్నారు.