వర్షాల్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన హెల్మెట్ వైపర్..

కార్లు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు వైపర్స్ ఉంటాయి. కానీ బైక్స్, స్కూటీలు వంటి టూవీలర్స్ కి మాత్రం ఉండవు.

వైపర్ వల్ల అద్దం మీద పడ్డ వర్షం నీరు నిల్వ ఉండదు. దీని వల్ల రోడ్డు క్లియర్ గా కనబడుతుంది.

టూవీలర్స్ కి వైపర్స్ ఉండవు. దీని వల్ల వాహనాలు స్కిడ్ అయితే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అందుకే హెల్మెట్ కి ఈ వైపర్ పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు.  

హెల్మెట్ మీద వర్షం పడినప్పుడు ఈ వైపర్ హెల్మెట్ గ్లాస్ మీద వర్షపు నీరుని తుడిచేస్తుంది. దీని వల్ల మీకు రోడ్డు స్పష్టంగా కనబడుతుంది.

ఎలక్ట్రో ప్రైమ్ పేరుతో ఒక యూనివర్సల్ హెల్మెట్ వైపర్ అందుబాటులో ఉంది. అన్ని రకాల హెల్మెట్స్ కి సెట్ అయ్యేలా దీన్ని డిజైన్ చేశారు.

ఐపీ5 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. యూఎస్బీ ద్వారా దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు.

బ్యాటరీ ద్వారా పని చేస్తుంది. వర్షం పడినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే వైపర్ గ్లాస్ పై ఉన్న నీటిని తుడిచేస్తుంది.

ఈ హెల్మెట్ వైపర్ అసలు ధర రూ. 5,287 ఉండగా.. ఆన్ లైన్ లో రూ. 3,916కే లభిస్తుంది.

ష్కాలకార్ మోటార్ సైకిల్ హెల్మెట్ వైపర్. దీని అసలు ధర రూ. 9,911 కాగా రూ. 6,194కే అందుబాటులో ఉంది.