ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోండి!

ఇప్పడు ఉన్న పొల్యూషన్ కి ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంతకాలం జీవిస్తాం

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని అశ్రద్ద చేస్తున్నారు.. దీంతో ఎన్నో అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు.

ఆరోగ్యం కోసం మనం వైద్యుల వద్దకు వెళ్తే మంచి ఆహారంతో పాటు, పండ్లు తినాలని సలహాలు ఇస్తుంటారు.

అధిక బరువు ఉన్నా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

బరువు తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యోగ, వ్యాయామం, డైట్ లాంటి చేస్తుంటారు.

మనం తినే ఆహారంలో పోషక విలువులు ఉన్నవి ఎక్కువగా ఎంచుకోవాలి.

నీళ్లు తాగాలి, వ్యాయామం ఎక్కువగా చేయాలి, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు

మొలకెత్తిన గింజలు, ఎగ్ వైట్, చిరు ధాన్యాలు, ఉడకబెట్టిన పప్పులు తినాలి. చక్కర, కొవ్వు స్థాయి అధికంగా ఉండే పదార్ధలకు దూరంగా ఉండాలి.

ఇక పండ్లలో ఎన్నో రకాల పోషక పదార్ధాలు ఉంటాయి.

పౌష్టికాహారానికి బాదం పప్పు, పిస్తా, జీడి పప్పు, వాల్ నట్స్ తీసుకుంటే మంచిది

ఒక యాపిల్ తో కొన్ని వాల్ నట్స్ తీసుకుంటే చాలా మంచిదాని నిపుణులు చెబుతున్నారు

మామిడి, బొప్పాయి, అరటి లాంటి పసుపు రంగు పండ్లలో విటమిన్ - ఎ సమృద్దిగా ఉంటుంది. ఇది రోగ నిరోదకశక్తి పెంచుతుంది.

దానిమ్మ, సపోట, జామ వంటి పండ్లు తింటే సరైన జీర్ణంతో పాటు, కేలరీలు లభిస్తాయి.