తోటకూర ఓకే .. ఎర్ర తోటకూర తెలుసా? ఇది తింటే కదా ఆరోగ్యం!

తాజా ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని అందరికి తెలుసు. 

అందుకే వాటిని ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.

అయితే చాలా మందికి ఆకు కూరల్లో ఎర్ర తోట కూర అనేది ఉంటుందని తెలీదు.

ఈ అరుదైన ఎర్ర తొటకూరను తింటే.. ఆ సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎర్ర తోట కూర తినడం వల్ల మనిషికి ఒత్తిడి దూరమై.. రిలాక్స్ అవుతారు.  

అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్త పోటును నియంత్రిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది తింటే షూగర్ లెవల్స్ ను కంట్రోల్ అవుతాయి.

ఈ తోటకూరలో కాల్షియం కూడా ఎక్కువ లభించడం మూలంగా ఎముకలు దృఢత్వంగా ఉంటాయి.

బాడీలో రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా.. రక్త హీనత సమస్యను దూరం చేస్తుంది.

గమనిక

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం