పైనాపిల్ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

పైనాపిల్ లో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి.

పైనాపిల్  తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి.

పైనాపిల్‌లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. 

పైనాపిల్‌లో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. మధుమేహం, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

పైనాపిల్‌లోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. 

పైనాపిల్ తింటే చర్మం నిగారింపు మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

పండిన పైనాపిల్ తింటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది.

వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా విముక్తి పొందవచ్చు.

పైనాపిల్ లో ఉండే ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.