చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే.. బెల్లంతో వీటిని కలిపి తినండి!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చలి రోజురోజుకూ తీవ్రమవుతోంది.

శీతాకాలంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే బెల్లంతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే బోలేడు ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్రతిరోజూ బెల్లం ముక్క తింటే.. చలిని తట్టుకోవచ్చు.

శీతాకాలంలో బెల్లం-నువ్వులు కలిపి తింటే పోషకాలతో పాటు శరీరానికి ఉష్ణోగ్రత లభిస్తుంది.

ఐరన్ లోపం ఉన్నవారు ప్రతిరోజూ బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలను తింటే మంచిది. అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది.

బెల్లంలో గ్లైసెమిక్ తక్కువే కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచదు. మధుమేహం ఉన్నవారు ఆర్గానిక్ బెల్లాన్నితినొచ్చు.

శరీరం వెచ్చగా ఉండాలంటే పసుపు పాలల్లో బెల్లం కలిపి కూడా తాగవచ్చు. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది..

మీరు తరచుగా జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతుంటే అల్లం మరియు బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది..

నెయ్యితో బెల్లాన్ని కలిసి తినడం వల్ల, మలబద్దకం నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

శీతాకాలంలో బెల్లంతో పాటు వేరుశెనగ తినడం వల్ల శరీరం బలంగా ఉండడంతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయి.