ఆరోగ్యానికి ఆకు కూరలు ఎంతో మేలు చేస్తాయి!

మనిషి ఆరోగ్యం కోసం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం, ప్రొటిన్లు ఆహారం తీసుకోవాలి.

బయట జంగ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినేవారికి అనారోగ్య సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు.

ఆకు కూరల్లో శరీరానికి కావల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి.

అనారోగ్య సమస్యలను నివారించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఆకు కూరల్లో పుష్కలంగా ఉంటాయి.

చక్కటి కంటిచూపు, మెదడు చురుకుగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

తోటకూర, బచ్చలికూర, గోంగూర, పొన్నగంటి కూర, మునగాకు, మెంగికూర, కరివేపాకు ఏదో ఒక రకంగా తింటే మంచిది

ఈ ఆకు కూరల్లో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, కె, డి ఉంటాయి.

బచ్చలికూర, పాలకూర, ఆవ కూర డీఎన్ఏ ని రక్షించడానికి బాగా పనిచేస్తాయి. క్యాన్సర్‌ కణాలను నిరోధిస్తాయి.

ఆకు కూరల్లో బీటా కేటోరిన్, విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

గోంగూర, బచ్చలి కూర గుండె పోటు సమస్యల నుంచి దూరం చేస్తాయి.

ఆకు కూరల్లో సాధారణంగా క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది.