ఆరోగ్యానికి మేలు చేసే కీరా దోస  

రాబోయేది ఎండాకాలం.. మండే ఎండల్లో చలువనిచ్చే పదార్ధాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

వేసవిలో చలువనిచ్చే ఆహార పదార్ధాల్లో కీర దోస ఒకటి

ఎండా కాలంలో శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు పోతుంది.. కీర దోస తినడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది.

కీర దోస లో విటమిన్ ఎ, బి, సీలు రోగ నిరోధక శక్తి పెంచడంలో దోహదపడుతుంది.

96 శాతం వరకు నీరు ఉండే కీర దోస తింటే చలువ తో పాటు శక్తి కూడా లభిస్తుంది.

రక్త పోటు ఉన్నవాళ్లు దాన్ని కంట్రోల్ చేయడానికి కీర దోస తింటే చాలా మంచిది

కీర దోస తినడం వల్ల శరీరంలో ఉండే విషతుల్య పదార్థాలు తొలగిపోతాయి.

ప్రతిరోజూ కీర దోస తింటే కిడ్నీ లో ఏర్పడే రాళ్లను కరిగించడంలో తోడ్పడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడే పొటాషియం, మెగ్నిషియం, సిలికాన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

కళ్లు అలసిపోయినట్టు ఉన్నా, కళ్ల కింద మచ్చలు ఉన్నా కీర దోసని కట్ చేసుకొని కళ్లపై పెట్టుకుంటే చాలా రిలాక్స్ గా ఉంటుంది.

కీర దోస క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

కీర వల్ల గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవొచ్చు.

కీర దోస జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే వేడి కంట్రోల్ అవుతుంది. జ్వరం వచ్చిన వారికి కీరా జ్యూస్ ఎక్కువగా ఇస్తుంటారు.