తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాక్ ఎలా ఉంది? హిట్టా? కాదా? అనేవి రివ్యూలో చూద్దాం.  

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాక్ ఎలా ఉంది? హిట్టా? కాదా? అనేవి రివ్యూలో చూద్దాం. 

హనుమంతు(తేజ సజ్జ) అనే దొంగ మీనాక్షి(అమృత అయ్యర్) అనే అమ్మాయి ప్రేమించుకుంటారు.

అత్యంత బలహీనుడైన హనుమంతు.. మీనాక్షి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రమాదంలోనే హనుమంతుకి.. ఆ హనుమాన్ శక్తులు సిద్ధిస్తాయి. 

సూపర్ హీరో అవ్వాలని తహతహలాడే మైఖెల్ హనుమంతు జీవితంలోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. 

హీరోకి సూపర్ పవర్స్ వచ్చేలా చూపించడం, కాన్ఫ్లిక్ట్ పాయింట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ముగించడం, ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్ తో ఫస్ట్ ఆఫ్ అంతా ఆకట్టుకునేలా సాగింది.

అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి ప్రశాంత్ వర్మ కూడా కాస్త తడబడ్డాడనిపిస్తుంది. 

హనుమంతుకి పవర్స్ వచ్చాక, ఆ పవర్ ఎక్కడ నుండి వస్తుందో మైఖెల్ కి అర్ధమయ్యాక కూడా కథ వేగం అందుకోదు.

ఎప్పుడైతే సముద్రఖని క్యారెక్టర్ రివీల్ అవుతుందో అక్కడ నుంచి హనుమాన్ అంచనాలు అందుకోలేని స్థాయికి వెళ్లిపోతాయి. 

ఇంత హైప్ ఇచ్చిన ప్రీ క్లైమాక్స్ కి తగ్గట్టే.. క్లైమాక్స్ మనసు, తనువు పులకించిపోయే రేంజ్ లో ఉండటంతో హనుమాన్.. సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది.

తేజ సజ్జా సహా అందరూ బాగా నటించారు. సాంకేతిక వర్గం పనితీరు బాగుంది.  

ప్లస్ లు: తేజ సజ్జ, సముద్రఖని, ప్రశాంత్ వర్మ డైరెక్షన్, టెక్నికల్ వర్క్, క్లైమాక్స్

మైనస్ లు: సెకండాఫ్ స్టార్టింగ్ లో కాస్త ల్యాగ్, సాంగ్స్ 

చివరి మాట:  హనుమాన్.. 2024 సంక్రాంతి తొలి హిట్ బొమ్మ.