ఫ్రిడ్జ్‌లు, ACలు కొనేవారికి గుడ్ న్యూస్

ఏసీ, ఫ్రిడ్జ్ లు వంటివి కొనేవారికి గుడ్ న్యూస్.

ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేవారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

మామూలుగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వారంటీ అనేది వస్తుంది.

అయితే స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లు వంటివి కొన్న రోజు నుంచే కస్టమర్ వినియోగిస్తారు

 కాబట్టి వారంటీ ఆరోజు నుంచి ఉన్నా ఇబ్బంది లేదు.

అయితే ఏసీ, వాషింగ్ మెషిన్ వంటి వస్తువులు కొన్నరోజున డెలివరీ అయినా గానీ ఇన్స్టలేషన్ మాత్రం అదే రోజున జరగదు.

తర్వాత రోజు గానీ, రెండు రోజులకి గానీ ఇన్స్టలేషన్ ఎక్స్ పర్ట్స్ రారు.

దీని వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని కేంద్రం ప్రభుత్వం భావించింది.

ఇన్స్టలేషన్ చేయాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కొన్న తేదీన కాకుండా

ఇన్స్టలేషన్ చేసిన రోజునే వారంటీ తేదీగా పరిగణించనున్నారు

 వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీలకు సూచించింది.

కస్టమర్ల నుంచి వారంటీ విషయంలో ఫిర్యాదులు రావడంతో

కేంద్ర ప్రభుత్వం వారంటీ విషయంలో కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది.