భారీగా దిగివస్తున్న పసిడి.. ఈ రోజు ఎంతంటే?

మొన్నటి వరకు పరుగులు పెడుతున్న పసిడి ప్రస్తుతం దిగివస్తుంది.

ఈ మద్య కాలంలో ఎలాంటి శుభకార్యాలు లేకున్నా.. బంగారం డిమాండ్ ఎక్కడా తగ్గలేదు

గత నెల లో చుక్కలు చూపించిన పసిడి పది రోజుల నుంచి తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరటనిస్తుంది.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు

వరుసగా మూడోరోజు కూడా పసిడి ధరలు తగ్గడంతో జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు మహిళలు

అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి

అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాలతో దేశీయంగా ధరలు దిగివస్తున్నాయి.

నిన్న 22 క్యారెట్ 10 గ్రాములపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.900 తగ్గింది.ఈ రెండు రోజుల్లో పసిడి ధరలు ఏకంగా రూ.1900 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.66,390, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.72,430 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.66,540, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.72,580  వద్ద కొనసాగుతుంది.

ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.66,390, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.72,430 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ. 66,490, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.72,430 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీతో పాటు ముంబై, పూణే, కోల్ కొతా నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,900 వద్ద కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళా, చెన్నైలో కిలో వెండి ధర రూ. 92,400 వద్ద ట్రెండ్ అవుతుంది.