బడ్జెట్ ఎఫెక్ట్ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..  ఈ రోజు ఎంతంటే?

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది గోల్డ్ పై సుమారు 5 వేల వరకు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు గోల్డ్ రేటుపై పడుతుంది.

 ప్రస్తుతం ఆషాఢ మాసం.. పండుగలు, శుభకార్యాలు మొదలయ్యాయి.

మంగళవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

ఈ బడ్జెట్ లో ప్రభుత్వం బంగారం దిగుమతులపై కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించారు. 

బడ్జెట్ ప్రభావం పసిడిపై దారుణంగా పడింది.. ఏకంగా రూ.4 వేల మేర తగ్గింది.

పసిడి తో పాటు వెండి కూడా తగ్గాయి.

ఈ రోజు (జులై 25) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గింది

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,940, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,850

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.65,090,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.71,000

ముంబై,కోల్‌కొతా,కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,940 ఉండగా,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,850

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,890, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,790

దేశంలో కేజీ వెండి ధర రూ.100 వరకు తగ్గింది.

 తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.91,900

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.87,400

బెంగుళూరులో రూ.88,850 వద్ద కొనసాగుతుంది.