ఈ వంటింటి చిట్కాలతో.. ఇంట్లో దోమలను తరిమికొట్టండి!

వర్షాకాలం వచ్చంది అంటే.. ప్రతి ఒక్కరికి దోమల బెడద మొదలవుతుంది.

సాయంత్రానికి ఇంట్లోకి దోమల దండు వచ్చేస్తుంది.

ఎన్ని ఫ్యానులు వేసినా అవి మాత్రం ఇల్లు వదిలిపోవు.

ఒక్క ఐదు నిమిషాలు కదలకుండా ఉన్నాము అంటే కుట్టి రక్తం తాగేస్తాయి.

అలాగే ర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఒకవేళ్ల ఏమైనా కాయిల్స్, లిక్విడ్స్ వాడదాం అంటే.. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

అయితే వర్షాకాలంలో దోమలను ఇంటి నుంచి తరిమి కొట్టేందుకు కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి.

మీ బెడ్ రూమ్ లో  హారతి కర్పూరాన్ని వెలగించి ఆ పొగను రూమ్ లో వ్యాపించేలా చేయండి.

తర్వాత రూమ్ ని లాక్ చేయండి. ఒక 20 నిమిషాల తర్వాత ఆ రూమ్ లో ఉన్న దోమలు మొత్తం మాయమైపోతాయి.

కర్పూరాన్ని ఒక గిన్నెలో పెట్టి.. నీళ్లు పోసి గదిలో మూలల్లో ఉంచడి. దోమలు పారిపోతాయి.

నిమ్మకాయ, లవంగాయలతో కూడా దోమలను ఇంట్లోకి రాకుండా చేయచ్చు.

లవంగాయలను పొడి చేసి.. దానిలో నిమ్మరసం కలిపి ఒక ద్రావణంలా తయారు చేసుకోండి.

దానిని ఒక స్ప్రేయర్లో పోసుకుని కిటికీలు, తలుపుల దగ్గర స్ప్రే చేస్తే.. దోమలు రాకుండా ఉంటాయి.

తులసి, పుదీనా, లావెండర్ వంటి మొక్కలను ఇంట్లో ఉంచుకుంటే దోమలు రాకుండా చేస్తాయి.

అలాగే ఇంటి చుట్టుపక్కల చెత్త, నీళ్లు ఉండకుండా చూసుకోండి. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోండి.