ఎవరు ఈ మిస్ వైజాగ్ నక్షత్ర? ఫుల్ స్టోరీ ఇదే..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు మిస్ వైజాగ్ నక్షత్ర

రెండు రోజుల క్రితం వేరే యువతితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది

ఆ తరువాత తనకు న్యాయం కావాలంటూ రోడ్డుపై నిరసనకు దిగింది

ఇంతకీ ఈ మిస్ వైజాగ్ నక్షత్ర ఎవరు, ఆమె పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నక్షత్ర 2012 మిస్ వైజాగ్ టైటిల్ ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తరువాత పలు సినిమాల్లో నటించగా, అదే సమయంలో తేజతో పరిచయం ఏర్పడింది

2015 ఫిబ్రవరి వారిద్దరు పెళ్లి చేసుకోగా ఒక పాప జన్మించింది.

అనంతరం వారిద్దరి మధ్య చాలా ఇష్యూలు జరిగాయి.

చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు.

2020 వరకూ తన కాపురం బానే ఉండేదని.. 2021 నుంచి గొడవలు ఎక్కువయ్యాయని  తెలిపింది.

భర్త తేజ తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు.

అదనపు కట్నం కోసం హింసించేవాడని నక్షత్ర  ఆరోపించారు.

ఇటీవలే భర్తను వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

అతడు కూడా తన వైపు నుంచి పలు అంశాలను ప్రస్తావించాడు.

మొత్తంగా మిస్ వైజాగ్ నక్షత్ర ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.