బత్తుని చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పూర్తి! వివరాలు ఇవే..

చేప ప్రసాదం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ సమస్యల ఈ చేప ప్రసాదం అందిస్తుంటారు.

ఏటా మృగశిర కార్తెక  సందర్బంగా ఈ ప్రసాద వితరణ జరుగుతుంటుంది.

బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాద వితరణ చేస్తుంటారు.

ఏటా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ  ప్రసాదం పంపిణీ చేస్తుంటారు.

ఈ ఏడాది కూడా మృగశిర కార్తె జూన్ 8 వ తేదీన శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశిస్తుంది.

జూన్ 8, జూన్ 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

 ఈ చేప ప్రసాదం పంపిణీ భక్తులకు పూర్తి ఉచితంగా అందిస్తుంటారు.

రెండు తెలుగు రాష్ట్రంలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రసాదం కోసం వస్తుంటారు.

1847లో హైదరాబాద్‌ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైందని చెప్తుంటారు.

రెండేళ్ల క్రితం కోవిడ్‌ కారణంగా చేప ప్రసాదం పంపిణీ  కార్యక్రమం నిల్చిపోయింది.

గతేడాది నుంచి తిరిగి చేప ప్రసాద పంపిణీకి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది

ఈసారి కూడా భారీ సంఖ్యలో శ్వాస సంబంధిత రోగులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం