పండ్లు తింటే హాయిగా నిద్ర పడుతుంది..  అవేంటి అంటే..

ఈమధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి.

రాత్రి ఎంత సమయం గడుస్తున్నా నిద్ర పట్టడు.

నిద్రపోదామని ఎన్ని ప్రయాత్నాలు చేసిన కొందరి విషయంలో నో యూజ్‌.

అలాంటి వారు.. పడుకునే ముందు ఈ పండ్లను తింటే హాయిగా నిద్ర పడుతుంది.

ఇంతకు ఆ పండ్లేవి అంటే .... 

అరటి పండ్లు.. వీటిల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం కండరాలను రిలాక్స్‌ చేసి..

హ్యాపీ హార్మోన్‌ సెరోటోనిన్‌ను ఉత్పత్తని పెంచుతాయి. 

వీటి వల్ల త్వరగా నిద్ర పడుతుంది.

పడుకునేముందు చెర్రీ పండ్లు తింటే దానిలోని మెలటోనిన్‌ వల్ల హాయిగా నిద్ర పడుతుంది. 

నిద్రపోయేముందు పైనాపిల్‌ తీసుకుంటే దానిలో ఉండే విటమిన్‌ సీ, మెలటోనిన్‌ వల్ల నిద్ర పడుతుంది.

కివీ పండ్లలో కూడా విటమిన్‌ సీ, సెరోటోనిన్‌ సమృద్ధిగా ఉంటాయి. 

అందుకే నిద్రపోయే మందు కివీ తింటే హాయిగా నిద్ర పడుతుంది. 

రాత్రి పడుకునేముందు విటమిన్‌ సీ ఎక్కువగా ఉండే నారింజ తిన్నా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. 

రాత్రిపూట నిద్ర పట్టాలంటే.. కొద్దిగా బొప్పాయి తిన్నా చాలు.

దీనిలో ఉండే విటమిన్‌ సీ, ఈ, ఫోలేట్‌, పొటాషియం హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి

రాత్రి పూట పడుకునేముందు ఆపిల్‌ తింటే.. 

దానిలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ మనల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.